తస్య సంజనయన్హర్షం కురువృద్ధః పితామహః ।
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ।। 12 ।।
తస్య — అతనికి; సంజనయన్ — కలిగించుచు; హర్షం — సంతోషమును; కురు-వృద్ధః — కురు వంశములో వృద్ధుడు (భీష్ముడు); పితామహః — తాత గారు; సింహ-నాదం — సింహ గర్జన; వినద్య — శబ్దం చేసి; ఉచ్చైః — పెద్ద స్వరంతో; శంఖం — శంఖమును; దధ్మౌ — మ్రోగించెను; ప్రతాప-వాన్ — తేజోవంతమైన.
Translation
BG 1.12: అప్పుడు, కురువృద్ధుడు, మహోన్నత మూలపురుషుడైన భీష్మ పితామహుడు, సింహంలా గర్జించాడు, మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ, దుర్యోధనుడికి హర్షమును కలుగచేసెను.
Commentary
భీష్మ పితామహుడు తన మనవడి హృదయంలో ఉన్న భయాన్ని అర్థం చేసుకున్నాడు, మరియు సహజంగా అతని మీద వున్న వాత్సల్యంతో, అతన్ని సంతోషపరచటానికి పెద్ద శబ్దంతో తన శంఖాన్ని పూరించాడు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే అవతలి పక్షంలో ఉండటంచే, దుర్యోధనుడి విజయానికి ఏమాత్రం అవకాశం లేదని తెలిసినా, తన ధర్మాన్ని నిర్వర్తిస్తానని మనవడికి తెలియచేసాడు. అప్పటి యుద్ధ నియమాల ప్రకారం ఇది యుద్ధ ప్రారంభానికి సంకేతం.