Bhagavad Gita: Chapter 1, Verse 13

తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః ।
సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములోఽభవత్ ।। 13 ।।

తతః — ఆ తరువాత; శంఖాః — శంఖములు; చ — మరియు; భేర్యః — భేరీలు; చ — మరియు; పణవ-ఆనక — డోళ్ళు మరియు ఢంకాలు; గో-ముఖాః — కొమ్ము వాద్యములు; సహసా — అకస్మాత్తుగా ఒక్కపెట్టున; ఏవ — నిజంగా; అభ్యహన్యంత — పెద్దగా మ్రోగినవి; సః — ఆ యొక్క; శబ్దః — శబ్దము; తుములః — భయానకముగా; అభవత్ — ఉండెను.

Translation

BG 1.13: ఆ తరువాత, శంఖములు, డోళ్ళు, ఢంకాలు, భేరీలు, మరియు కొమ్ము వాయిద్యములు ఒక్కసారిగా మ్రోగినవి, మరియు వాటన్నిటి కలిసిన శబ్దం భయానకముగా ఉండెను.

Commentary

యుద్ధానికి భీష్ముడి యొక్క గొప్ప ఉత్సాహాన్ని గమనించిన కౌరవ సైన్యం కూడా ఉత్సాహవంతులై రణగొణ ధ్వని చేసారు. పణవ అంటే ఢంకాలు, ఆనక అంటే డోళ్ళు/ఢంకాలు, మరియు గో-ముఖ అంటే కొమ్ము వాద్యములు. ఇవన్నీ వాద్య పరికరములే, మరియు వీటన్నిటీ ఒక్కుమ్మడి శబ్దం మిక్కిలి కోలాహలాన్ని కలుగచేసింది.

Watch Swamiji Explain This Verse