అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ।
ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః ।। 20 ।।
హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే ।
అథ — అనంతరము; వ్యవస్థితాన్ — క్రమంగా నిలిచివున్న; దృష్ట్వా — చూసి; ధార్తరాష్ట్రాన్ — ధృతరాష్ట్రుని తనయులు; కపి-ధ్వజః — వానరమును (కోతి) జండాపై కలవాడు; ప్రవృత్తే — ప్రారంభించటానికి సిద్దంగా వున్న; శస్త్ర సంపాతే — ఆయుధములు వాడటానికి; ధనుః — ధనుస్సు (విల్లు) ను; ఉద్యమ్య — పైకెత్తి; పాండవః — అర్జునుడు, పాండు పుత్రుడు; హృషీకేశం — శ్రీ కృష్ణునితో; తదా — అప్పుడు; వాక్యం — పదములు; ఇదం — ఇవి; ఆహ — పలికెను; మహీ-పతే — రాజా.
BG 1.20: ఆ సమయంలో, తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగివున్న పాండుపుత్రుడు అర్జునుడు, తన ధనుస్సుని తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచిఉన్న మీ పుత్రులను చూసి, ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు.
శక్తిశాలి అయిన హనుమంతుడు తన రథం (జెండా) మీద ఉన్నాడు కాబట్టి, అర్జునుడికి కపి ధ్వజుడు అన్న పేరు ఉంది. దీనికి ఒక పూర్వ వృత్తాంతం ఉంది.
ఒకసారి అర్జునుడు విలు విద్యలో తనకున్న ప్రావీణ్యానికి గర్వపడి, శ్రీ రామచంద్రుని సమయంలో వానరములు భారతదేశం నుండి లంకకు సేతువు (బ్రిడ్జి)ని నిర్మించటానికి ఎందుకు అంత కష్టపడ్డారో తనకు అర్థం కావటంలేదు అని, శ్రీ కృష్ణునితో అన్నాడు. తనే గనక వుంటే, బాణములతో ఒక వారధిని చేసేవాడిని అన్నాడు. శ్రీ కృష్ణుడు, అది ఎలా చేసేవాడో చూపించమన్నాడు. అర్జునుడు తన శర పరంపరతో ఒక వంతెనని నిర్మించాడు. శ్రీ కృష్ణుడు హనుమంతుడిని ఆ వంతెనని పరీక్షించడానికి రమ్మని పిలిచాడు. హనుమ దానిపై నడవటం ప్రారంభించగానే ఆ వంతెన కూలిపోవటం మొదలయింది. తన బాణాలతో చేసిన వారధి రాముని అపారమైన (వానర) సైన్య బరువుని తట్టుకోలేదని అర్జునుడికి అర్థం అయింది మరియు అర్జునుడు తన తప్పుకి క్షమాపణ వేడుకున్నాడు. అప్పుడు హనుమంతుడు అర్జునుడికి, ఎప్పుడూ తన ప్రావీణ్యం చూసుకొని గర్వపడొద్దని హితవు చెప్పాడు. హనుమ దయాళువై, మహాభారత యుద్ధంలో నీ రథంపై కూర్చుంటాను అని అర్జునుడికి వరం ఇచ్చాడు. ఈ విధంగా, అర్జునుడి రథం, హనుమంతుని చిహ్నంతో ఉన్న జెండాని కలిగి వుంది. దీనితో అతనికి 'కపి ధ్వజుడు', అంటే జెండాపై వానరుడు ఉన్నవాడు, అన్న పేరొచ్చింది.
అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ।
ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః ।। 20 ।।
హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే ।
ఆ సమయంలో, తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగివున్న పాండుపుత్రుడు అర్జునుడు, తన ధనుస్సుని తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచిఉన్న మీ పుత్రులను చూసి, ఓ …
Sign in to save your favorite verses.
Sign In
మీరు వెతుకుతున్న జ్ఞానానికి నేరుగా వెళ్లండి
పవిత్ర భగవద్గీత యొక్క శాశ్వత ప్రేరణాత్మక జ్ఞానంతో మీ రోజును ప్రారంభించండి; అది నేరుగా మీ ఇమెయిల్‌కు చేరుతుంది!
Welcome 🙏
Here's what you've unlocked
Bookmarks
Save verses for quick return
Notes
Write your own reflections
Progress
Track all 18 chapters
Verse of the Day
A new shloka in your inbox daily