Bhagavad Gita: Chapter 1, Verse 41

అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః ।
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః ।। 41 ।।

అధర్మా — అధర్మము; ఆభిభవాత్ — ప్రబలిపోవుట; కృష్ణ — శ్రీ కృష్ణా; ప్రదుష్యంతి — నీతి తప్పిన వారై; కుల-స్త్రియః — కుటుంబంలోని స్త్రీలు; స్త్రీషు — స్త్రీలు; దుష్టాసు — దుర్నీతి పరులై; వార్ష్ణేయ — వృష్ణి వంశస్థుడా; జాయతే — పుడతారు; వర్ణ-సంకరః — అవాంఛిత సంతానం.

Translation

BG 1.41: దుర్గుణాలు ప్రబలిపోవటం వలన, ఓ కృష్ణా, కులస్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు; మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన, ఓ వృష్ణి వంశస్థుడా, అవాంఛిత సంతానం జన్మిస్తారు.

Commentary

వైదిక నాగరికత, స్త్రీలకు చాలా ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించింది మరియు స్త్రీలు పవిత్రంగా ఉండటానికి ఎంతో ప్రాముఖ్యత నిచ్చింది. అందుకే మను-స్మృతిలో ‘యత్ర నార్యస్ తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః (3.56) ‘ఎక్కడెక్కడైతే స్త్రీలు పవిత్రమైన, పరిశుద్ధమైన నడవడికతో ఉంటారో, మరియు ఆ యొక్క పవిత్రతకు వారు మిగతా సమాజంచే పూజింపబడుతారో, అక్కడ దేవతలు హర్షిస్తారు.’ కానీ, స్త్రీలు నీతిబాహ్యమైన ప్రవర్తనతో ఉన్నప్పుడు, బాధ్యతారహితమైన పురుషులు తమ జారత్వానికి, దాన్ని అదునుగా తీసుకొనుటం వలన అవాంఛిత సంతానం కలుగుతారు.

Watch Swamiji Explain This Verse