Bhagavad Gita: Chapter 11, Verse 22

రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా
విశ్వేఽశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ ।
గంధర్వయక్షాసురసిద్ధసంఘా
వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే ।। 22 ।।

రుద్ర — శంకర భగవానుని ఒక స్వరూపము; ఆదిత్యాః — ఆదిత్యులు; వసవః — వసువులు; యే — ఈ; చ — మరియు; సాధ్యాః — సాధ్యులు; విశ్వే — విశ్వదేవతలు; అశ్వినౌ — అశ్వినీ కుమారులు; మరుతః — మరుత్తులు; చ — మరియు; ఉష్మ-పాః — పూర్వీకులు; చ — మరియు; గంధర్వ — గంధర్వులు; యక్ష — యక్షులు; అసుర — అసురులు; సిద్ధ — సిద్ధులు; సంఘా — సమూహములు; వీక్షంతే — తిలకిస్తున్నారు; త్వాం — నిన్నే; విస్మితాః — సంభ్రమాశ్చర్యములతో; చ — మరియు; ఏవ — యథార్థముగా; సర్వే — అందరూ.

Translation

BG 11.22: రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్వినీ కుమారులు, మరుత్తులు, పితరులు, గంధర్వులు, యక్షులు, అసురులు, మరియు సిద్ధులు అందరూ కూడా సంభ్రమాశ్చర్యములతో నిన్నే తిలకిస్తున్నారు.

Commentary

వీరందరూ గణములూ తమతమ స్థానములను భగవంతుడి అనుగ్రహ శక్తి ద్వారానే పొందారు మరియు తమ తమ కర్తవ్యములను సృష్టి యొక్క నియమముల ప్రకారంగానే నిర్వర్తిస్తుంటారు. అందుకే వారందరూ కూడా విశ్వ రూపమును ఆశ్చర్యముతో దర్శిస్తున్నారని పేర్కొనబడ్డారు.