Bhagavad Gita: Chapter 11, Verse 49

మా తే వ్యథా మా చ విమూఢభావో
దృష్ట్వా రూపం ఘోరమీదృఙ్మమేదమ్ ।
వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం
తదేవ మే రూపమిదం ప్రపశ్య ।। 49 ।।

మా తే — నీకు ఇది కూడదు; వ్యథా — భయము; మా — కాదు; చ — మరియు; విమూఢ-భావః — అయోమయ స్థితి; దృష్ట్వా — చూసిన పిదప; రూపం — రూపము; ఘోరం — భయంకరమైన; ఈదృక్ — ఈ విధమైన; మమ — నా యొక్క; ఇదం — ఇది; వ్యపేత-భీః — భయరహితముగా; ప్రీత-మనాః — ప్రసన్న చిత్తముతో; పునః — మరల; త్వం — నీవు; తత్ ఏవ — ఆ యొక్క; మే — నా యొక్క; రూపం — రూపము; ఇదం — ఇది; ప్రపశ్య — తిలకించుము.

Translation

BG 11.49: నా యొక్క ఈ భయంకర రూపమును చూసి భయపడవద్దు, భ్రాంతికి లోను కావద్దు. భయరహితముగా ప్రసన్నచిత్తముతో మరొకసారి నా యొక్క స్వరూపమును చూడుము.

Commentary

అనవసరముగా భయపడకుండా, నిజానికి అర్జునుడు విశ్వరూప దర్శన అనుగ్రహం లభించినందుకు గర్వపడాలి అని చెప్తూ, అర్జునుడిని సముదాయించటం శ్రీకృష్ణుడు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. అంతేకాక, తన యొక్క మామూలు రూపమును తిరిగి చూసి ఇక భయమును వదిలి వేయమంటున్నాడు, శ్రీ కృష్ణుడు.