Bhagavad Gita: Chapter 13, Verse 22

పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ ।
కారణం గుణసంగోఽస్య సదసద్యోనిజన్మసు ।। 22 ।।

పురుషః — జీవాత్మ; ప్రకృతి-స్థః — ప్రకృతిలో స్థితమై ఉండి; హి — నిజముగా; భుంక్తే — భోగించ దలచి; ప్రకృతి-జాన్ — భౌతిక శక్తి (ప్రకృతి) జనితమైన; గుణాన్ — త్రిగుణములు; కారణం — కారణము; గుణ-సంగః — గుణములతో సంగము (మమకారాసక్తి); అస్య — దాని యొక్క; సత్-అసత్-యోని — ఉఛ్చమైన-నీచమైన-గర్భములో; జన్మసు — పుట్టుట.

Translation

BG 13.22: ఎప్పుడైతే ప్రకృతిలో (భౌతిక శక్తి) లో స్థితమై ఉన్న పురుషుడు (జీవాత్మ) త్రిగుణములను సుఖించదలచాడో, వాటి పట్ల మమకారాసక్తియే, ఆ జీవాత్మకు ఉన్నతమైన జన్మ మరియు నీచ జన్మలకు కారణమగును.

Commentary

ఇంతకు క్రితం శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, పురుషుడు (ఆత్మ) యే సుఖదుఃఖానుభూతులకు బాధ్యుడు అని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు అలా ఎందుకో వివరిస్తున్నాడు. ఈ శరీరమే తాను అనుకుని, ఆత్మ, శారీరక సుఖాల దిశగా దానిని ఉత్తేజపరుస్తుంది. శరీరము మాయచే తయారుచేయబడినది కావున, అది త్రిగుణాత్మకమైన - సత్వము, రజస్సు, మరియు తమస్సు లచే ఉన్న – భౌతిక ప్రకృతినే అనుభవించాలని చూస్తుంది.

అహంకారము వలన, ఆత్మ తానే కర్తను, మరియు శరీరమును అనుభవించేవాడను అని అనుకుంటుంది. శరీరము, మనస్సు, మరియు బుద్ధి అన్ని పనులను చేస్తుంటాయి, కానీ వాటన్నిటికీ జీవాత్మయే బాధ్యుడు. ఇది ఎలాగంటే, ఒక బస్సుకు ప్రమాదం జరిగితే, దాని యొక్క చక్రాల మరియు స్టీరింగ్ లపై నింద ఉండదు; ఆ బస్సు యొక్క డ్రైవర్ దానికి బాధ్యత వహించాలి. అదే విధంగా, ఇంద్రియములు, మనస్సు మరియు బుద్ధి - ఆత్మ చే ప్రేరేపితమై (శక్తినివ్వబడి) దాని ఆధీనంలో ఉంటాయి. అందుకే, శరీరము చే చేయబడిన అన్ని పనుల కర్మలను కూడబెట్టుకునేది ఆత్మయే. అసంఖ్యాకమైన జన్మలలో ప్రోగుచేయబడిన ఈ యొక్క కర్మరాశి , ఆత్మకి, ఉన్నతమైన లేదా నీచ గర్భములలో పదే పదే జన్మను కలుగచేస్తుంది.