కచ్చిదేతఛ్చ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా ।
కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ ।। 72 ।।
కచ్చిత్ — జరిగినదా? ఏతత్ — ఇది; శ్రుతం — వినుట; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; త్వయా — నీచేత; ఏక-అగ్రేణ-చేతసా — ఏకాగ్ర చిత్తముతో; కచ్చిత్ — అయినదా? అజ్ఞాన — అజ్ఞానము; సమ్మోహః — మోహము/భ్రమ; ప్రణష్టః — నిర్మూలించబడుట; తే — నీ యొక్క; ధనంజయః — అర్జునా, సంపదను జయించే వాడా.
Translation
BG 18.72: ఓ అర్జునా, నేను చెప్పినది ఏకాగ్రతతో విన్నావా? నీ యొక్క అజ్ఞానము, మోహభ్రాంతి నిర్మూలించబడినవా?
Commentary
శ్రీ కృష్ణుడు అర్జునుడి గురువు స్థానములో ఉన్నాడు. గురువు గారు సహజంగానే, తన శిష్యుడు విషయాన్ని అంతా బాగా అర్థం చేసుకున్నాడా లేదా అని అడుగుతాడు. ఇలా అడగటం వెనుక ఉన్న కృష్ణుడి ఉద్దేశ్యం ఏమిటంటే, ఒకవేళ అర్జునుడు గనక అర్థం చేసుకోలేకపోతే, తను మళ్ళీ చెప్పటానికి లేదా ఇంకా అర్థ వివరణ చేయటానికి సిద్ధంగా ఉన్నానని తెలియచేయటమే.