Bhagavad Gita: Chapter 18, Verse 76

రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతమ్ ।
కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః ।। 76 ।।

రాజన్ — రాజా; సంస్మృత్య సంస్మృత్య — పదే పదే స్మరిస్తూ; సంవాదమ్ — సంవాదము; ఇమం — ఇది; అద్భుతమ్ — అద్భుతమైన; కేశవ-అర్జునయోః — శ్రీ కృష్ణ పరమాత్మ మరియు అర్జునుడి మధ్య జరిగిన; పుణ్యం — పవిత్రమైన; హృష్యామి — ఆనందిస్తున్నాను; చ — మరియు; ముహుః -ముహుః — పదే పదే. ఫ్రెడ్

Translation

BG 18.76: సర్వోత్కృష్ట శ్రీ కృష్ణ భగవానునకు మరియు అర్జునుడికి మధ్య జరిగిన ఈ మహాద్భుతమైన సంవాదమును పదేపదే గుర్తుచేసుకుంటూ, ఓ రాజా, నేను మళ్ళీ మళ్ళీ ఆనందిస్తున్నాను.

Commentary

ఆధ్యాత్మిక అనుభవము అనేది సమస్త భౌతిక ఆనందాలని ఒక్కచోట కూర్చినదానికన్నా ఎక్కువ హర్షమును, తృప్తిని కలిగించే ఆనందముని ఇస్తుంది. సంజయుడు అటువంటి ఆనందమును అనుభవిస్తూ, తన అనుభవాన్ని అంధుడైన ధృతరాష్ట్రునితో పంచుకుంటున్నాడు. ఈ అద్భుతమైన సంవాదముని గుర్తుచేసుకుంటూ, ఆయన దివ్య ఆనందమును అనుభవిస్తున్నాడు. ఈ గీతా శాస్త్రములో ఉన్న జ్ఞానము యొక్క మహనీయతను మరియు సంజయుడు చూసిన లీలల యొక్క దైవత్వమును, ఇది సూచిస్తున్నది.