Bhagavad Gita: Chapter 2, Verse 24

అచ్ఛేద్యోఽయమదాహ్యోఽయమ్ అక్లేద్యోఽశోష్య ఏవ చ ।
నిత్యః సర్వగతః స్థాణురచలోఽయం సనాతనః ।। 24 ।।

అచ్ఛేద్యః — ఛేదింపబడనిది; అయం — ఈ ఆత్మ; అదాహ్యః — దహింప బడనిది; అయం — ఈ ఆత్మ; అక్లేద్యః — తడుపుటకు సాధ్యం కానిది; అశోష్యః — ఎండిపోనిది; ఏవ — నిజముగా; చ — మరియు; నిత్యః — ఎప్పుడూ ఉండేది; సర్వ-గతః — అంతటా వ్యాపించి ఉండేది; స్థాణుః — మార్చలేనిది; అచలః — పరివర్తనలేనిది; అయం — ఈ ఆత్మ; సనాతనః — సనాతనమైనది.

Translation

BG 2.24: ఆత్మ, విచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింపశక్యం కానిది; దానిని తడుపుటకును మరియు ఎండించుటకును సాధ్యం కాదు. అది నిత్యము, అంతటా ఉండేది, మార్పులేనిది, పరివర్తనలేనిది, మరియు సనాతనమైనది.

Commentary

ఆత్మ యొక్క అమరత్వం ఇక్కడ మళ్లీ చెప్పబడింది. గురువు గారు పరిపూర్ణ జ్ఞానం కేవలం చెపితే సరిపోదు; ఆ జ్ఞానం ఉపయోగపడాలంటే, విద్యార్థి హృదయంలోనికి అది లోతుగా చేరాలి. కాబట్టి నైపుణ్యం గల గురువు తరచుగా ఇంతకూ ముందే చెప్పిన విషయాన్ని పునరావృత్తం చేస్తాడు. సంస్కృత సాహిత్యంలో దీనిని పునరుక్తి అంటే 'మళ్లీ చెప్పటం' అంటారు. తన విద్యార్థికి బాగా అర్థం అయ్యేలా, ముఖ్యమైన ఆధ్యాత్మిక సూత్రాలను గట్టిగా చెప్పటానికి శ్రీ కృష్ణుడు చాలా సార్లు 'పునరుక్తి' ని భగవద్గీతలో ఒక ఉపకరణంలా వాడాడు.

Watch Swamiji Explain This Verse