దేహీ నిత్యమవధ్యోఽయం దేహే సర్వస్య భారత ।
తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి ।। 30 ।।
దేహీ — దేహములో వసించే ఆత్మ; నిత్యం — ఎల్లప్పుడూ; అవధ్యః — వధింపబడనిది/నిత్యశాశ్వతమైనది; అయం — ఈ ఆత్మ; దేహే — శరీరములో; సర్వస్య — అందరి; భారత — భరత వంశీయుడా, అర్జునా; తస్మాత్ — కాబట్టి; సర్వాణి — అందరి; భూతాని — ప్రాణులు; న — కాదు; త్వం — నీవు ; శోచితుం — శోకించుట; అర్హసి — తగును.
Translation
BG 2.30: ఓ అర్జునా, దేహమునందు ఉండెడి ఆత్మ చావులేనిది; కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నీవు శోకించుట తగదు.
Commentary
తరచుగా, తన ఉపదేశ క్రమంలో, శ్రీ కృష్ణుడు కొన్ని శ్లోకాలలో ఒక విషయాన్ని వివరించిన తరువాత చివరికి ఒక శ్లోకంలో దాని సారాంశాన్ని చెప్తాడు. ఆత్మ యొక్క అమరత్వాన్ని మరియు శరీరానికి దానికి ఉన్న భేదాన్ని చెప్పిన ఉపదేశ సారాంశము, ఈ శ్లోకం.