స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ।
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోఽన్యత్ క్షత్రియస్య న విద్యతే ।। 31 ।।
స్వ-ధర్మము — వేదానుసారము ఉన్న తన కర్తవ్యము; అపి — కూడా; చ — మరియు; అవేక్ష్య — పరిగణలో; న — కాదు; వికంపితుమ్ — చలించుట; అర్హసి — తగును; ధర్మ్యాత్ — ధర్మ పరిరక్షణకు; హి — నిజముగా; యుద్ధాత్ — యుద్ధము కంటే; శ్రేయః — శ్రేయస్సు; అన్యత్ — వేరే ఏది; క్షత్రియస్య — క్షత్రియుడికి; న — లేదు; విద్యతే — ఉండును.
Translation
BG 2.31: అంతేకాక, నీ యొక్క క్షత్రియ స్వ-ధర్మమును అనుసరించి నీవు చలింపరాదు. నిజానికి, ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయటమనే దానికన్నా మించిన కర్తవ్యం లేదు.
Commentary
స్వ-ధర్మం అనేది వేదాల అనుగుణంగా ఒక వ్యక్తి చేయవలసిన విధి. రెండు రకముల స్వ-ధర్మములు, వేదనిర్దేశిత విధులు ఉన్నాయి - 'పర ధర్మ' అంటే ఆధ్యాత్మిక విధులు మరియు 'అపర ధర్మ' అంటే ప్రాపంచిక విధులు. తనను తాను ఆత్మగా భావించినప్పుడు భగవంతుడిని ప్రేమించి, భక్తితో సేవించడమే చేయవలసిన విధి. దీనిని 'పర ధర్మ' అంటారు. కానీ, మానవాళిలో ఎక్కువ శాతం మంది ఈ ఆధ్యాత్మిక కోణం కలిగి ఉండరు కాబట్టి, తమని తాము శరీరాలుగా భావించుకునే వారి కోసం కూడా, వేదాలు, విధులను సూచించాయి. ఒక వ్యక్తి యొక్క ఆశ్రమము (జీవిత దశ) మరియు వర్ణము (వృత్తి) ల అనుగుణంగా ఈ ధర్మాలు నిర్దేశించబడ్డాయి. వీటిని అపర-ధర్మములు లేదా లౌకిక విధులు అంటారు. భగవద్గీత మరియు వైదిక తత్త్వాలను అర్థం చేసుకునేటప్పుడు ఆధ్యాత్మిక విధులు మరియు ప్రాపంచిక విధుల మధ్య ఉన్న భేదాన్ని గుర్తుంచుకోవాలి.
వృత్తి పరంగా, అర్జునుడు యోధుడు, కాబట్టి ధర్మ పరిరక్షణ కోసం పోరాడటం యోధుడిగా తన వృత్తి ధర్మం. శ్రీ కృష్ణుడు దీనిని స్వ-ధర్మము అంటున్నాడు, ఇది శరీర స్థాయిలో సూచింపబడిన విధి.