Bhagavad Gita: Chapter 2, Verse 37

హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీమ్ ।
తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః ।। 37 ।।

హతః — సంహరింపబడినచో; వా — లేదా; ప్రాప్స్యసి — పొందుతావు; స్వర్గం — స్వర్గమును; జిత్వా — గెలిచినచో; వా — లేదా; భోక్ష్యసే — అనుభవించెదవు; మహీమ్ — ఈ భూమండల రాజ్యమును; తస్మాత్ — కాబట్టి; ఉత్తిష్ఠ — లెమ్ము; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; యుద్ధాయ — యుద్ధమునకు; కృత-నిశ్చయ — దృఢ సంకల్పంతో.

Translation

BG 2.37: యుద్ధం చేస్తే నీవు, యుద్ధ రంగంలో వీరమరణం పొంది స్వర్గానికి పోయెదవు, లేదా విజయుడవై ఈ భూమండలముపై రాజ్యమును అనుభవించెదవు. కావున, కృత నిశ్చయుడవై లెమ్ము, ఓ కుంతీ పుత్రుడా, యుద్ధానికి సిద్ధముకమ్ము.

Commentary

2.31వ శ్లోకం నుండి శ్రీ కృష్ణుడు ఇంకా వృత్తికి సంబంధించిన విధుల స్థాయిలోనే బోధిస్తున్నాడు. తన కర్తవ్య నిర్వహణ వలన రెండు పరిణామాలు తలెత్తే అవకాశం ఉంది అని అర్జునుడికి వివరిస్తున్నాడు. అర్జునుడు విజయుడైతే, భూలోకంలో సామ్రాజ్యం అతనికోసం ఉంటుంది, ఒకవేళ కర్తవ్య నిర్వహణ లో ప్రాణాలు విడిచి పెట్టవలసి వస్తే, అతను స్వర్గ లోకాలకు వెళ్తాడు.

Watch Swamiji Explain This Verse