Bhagavad Gita: Chapter 2, Verse 44

భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్ ।
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే ।। 44 ।।

భోగ — భోగములు; ఐశ్వర్య — విలాసము; ప్రసక్తానాం — మిక్కిలి మమకారాసక్తి ఉన్నవారికి; తయా — దాని వలన; అపహృత-చేతసామ్ — బుద్ధి భ్రమించిన; వ్యవసాయ-ఆత్మికా — నిశ్చయమైన; బుద్ధిః — బుద్ధి; సమాధౌ — సాఫల్యం; న — కాదు; విధీయతే — సాధ్యము.

Translation

BG 2.44: ప్రాపంచిక భోగాలు, సుఖాల పట్ల మనస్సు మిక్కిలి మమకారాసక్తితో ఉండి మరియు వారి బుద్ధులు ఇటువంటి వాటిచే చిత్తభ్రాంతికి లోనయ్యి, వారు, భగవత్-ప్రాప్తి పథంలో సాఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు.

Commentary

మనస్సులో ఇంద్రియసుఖాల పట్ల ఆసక్తి ఉన్నవారు భోగాలు, ఐశ్వర్యముల కోసం ప్రాకులాడుతుంటారు. సంపాదనను పెంపొందించుకోవటానికి తమ బుద్ధి వాడుతూ, ఎలా ఇంకా ఎక్కువ భౌతిక సంపత్తి సమకూర్చుకుని, శారీరక సుఖానుభవములు మరింత పొందుదామా అని విచారిస్తుంటారు. ఈ విధంగా భ్రమకి లోనయ్యి, భగవత్ ప్రాప్తి పథంలో పయనించటానికి కావలిసిన దృఢ సంకల్పాన్ని అభివృద్ది చేసుకోలేకపోతారు.

Watch Swamiji Explain This Verse