Bhagavad Gita: Chapter 3, Verse 29

ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు ।
తానకృత్స్నవిదో మందాన్కృత్స్నవిన్న విచాలయేత్ ।। 29 ।।

ప్రకృతేః — భౌతిక ప్రకృతి యొక్క; గుణ — గుణములచే; సమ్మూఢాః — భ్రమకు లోనై; సజ్జంతే — ఆసక్తుడై; గుణ-కర్మసు — కర్మ ఫలముల యందు; తాన్ — వారు; అకృత్స్న-విదః — జ్ఞానము లేని జనులు; మందాన్ — అవివేకులు; కృత్స్న-విత్ — జ్ఞానులు; న విచాలయేత్ — కలవరపరచరాదు.

Translation

BG 3.29: గుణముల ప్రవృత్తిచే భ్రమకు లోనయిన వారు, వారి కర్మ ఫలముల యందు ఆసక్తులవుతారు. కానీ, ఈ సత్యములను అర్థం చేసుకున్న జ్ఞానులు, ఇది తెలియని అజ్ఞానులను కలవర పరచరాదు.

Commentary

మరి జీవాత్మ అనేది గుణములు, వాటి ప్రవృత్తి కంటే భిన్నమైనదే అయితే మరి అజ్ఞానులు ఇంద్రియ వస్తు/విషయముల పై మమకారాసక్తులు ఎందుకు అవుతారు? అని సందేహం రావచ్చు. వారు ప్రకృతి గుణములచే భ్రమకు లోనై వారే కర్తలము అని అనుకుంటున్నారు అని శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. ప్రకృతి యొక్క త్రి-గుణములచే పూర్తిగా సమ్మోహితులై, వారు ఇంద్రియ, శారీరక, మానసిక ఆనందం కోసమే పని చేస్తుంటారు. వారు కర్మలను ఒక కర్తవ్యంగా, ఫలాపేక్ష లేకుండా చేయలేరు.

కానీ, కృత్స్న-విత్ (జ్ఞానులు) లు, అంతగా విషయ జ్ఞానం లేని వారి మనసులను కలవర పెట్టరాదు. అంటే, జ్ఞానులు తమ అభిప్రాయాలను అజ్ఞానులపై ‘ నీవు ఆత్మవి, శరీరం కాదు కాబట్టి కర్మ అర్థరహితమైనది, దాన్ని విడిచిపెట్టు ’ అని బలవంతగా రుద్దటానికి ప్రయత్నించరాదు. వారు అజ్ఞానులకి తమ విహిత కర్మలని చేస్తుండమని ఉపదేశిస్తూ, నెమ్మదిగా మమకార/ఆసక్తి అతీత స్థితిని చేరుకోవటానికి సహకరించాలి. ఈ ప్రకారంగా, ఆధ్యాత్మిక విషయ జ్ఞానం ఉన్న వారికి, అదిలేని వారికి ఉన్న తేడాని వివరించిన పిదప, శ్రీ కృష్ణుడు అజ్ఞానుల మనస్సును కలవరపరచరాదు అనే గంభీరమైన హెచ్చరిక చేస్తున్నాడు.

Watch Swamiji Explain This Verse