Bhagavad Gita: Chapter 3, Verse 37

శ్రీ భగవానువాచ ।
కామ ఏష క్రోధ ఏష రజోగుణసముధ్భవః ।
మహాశనో మహాపాప్మా విధ్ధ్యేనమిహ వైరిణమ్ ।। 37 ।।

శ్రీ-భగవాన్-ఉవాచ — సర్వోన్నత భగవంతుడు ఇలా పలికెను; కామః — కోరిక; ఏష — ఇది; క్రోధః — కోపము; ఏష — ఇది; రజః-గుణ — రజో గుణము; సముధ్భవః — ఉత్పన్నమయిన; మహా-అశనః — అన్నిటిని కబళించే; మహా-పాప్మా — అత్యంత పాపిష్టి; విద్ధి — తెలుసుకొనుము; ఏనం — ఇది; ఇహ — ఈ ప్రాపంచిక లోకంలో; వైరిణమ్ — శత్రువు.

Translation

BG 3.37: సర్వోన్నత భగవంతుడు ఇలా పలికెను: రజో గుణము నుండి ఉత్పన్నమయ్యే కామమే (కోరికలు, వాంఛలు), తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది. దీనిని లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టి దాన్నిగా తెలుసుకొనుము.

Commentary

వేదములు 'కామము' అన్న పదాన్ని కేవలం లైంగిక వాంఛల కోసమే కాక మనము ఈ శరీరమే అన్న దృక్పథంలో ఉన్న అన్ని భౌతిక కోరికలను ఉద్దేశించి వాడతాయి. ఈ విధంగా కామము ఎన్నో రకాలుగా బహిర్గతమౌతుంది — డబ్బుల కోసం యావ, వస్తువుల కోసం ఆశ, కీర్తి/ప్రతిష్ఠ లపై ఆశ, అధికారం కోసం తపన; మొదలగునవి. ప్రతి యొక్క ప్రాణికి స్వ-సహజంగా ఉండే భగవంతుని యందు ప్రేమయే వక్రదారిలో పరావర్తనమైనప్పుడు కామముగా మారుతుంది. ఏవిధంగానైతే జీవాత్మ, భౌతిక శక్తితో అనుసంధానమై, తనను తాను ఈ శరీరరమే అనుకుంటుందో, అదే విధంగా దాని యొక్క యొక్క భగవంతునిపై ప్రేమ, రజో గుణ సాంగత్యం కారణంగా 'కామము' గా మారుతుంది. దివ్య ప్రేమ అనేది భగవంతుని యొక్క అత్యున్నత శక్తి, కాబట్టి భౌతిక ప్రపంచంలో దాని యొక్క వక్రమైన పరివర్తన (అంటే కామము) కూడా ప్రాపంచిక వ్యవహారాల్లో అత్యంత శక్తివంతమైనది.

ప్రాణాంతక క్యాన్సర్ మనలోనే ఉన్నట్లుగా, ప్రాపంచిక భోగాల కోసం ఉన్న ఈ 'కామమే', పాపానికి మూల కారణం అని శ్రీ కృష్ణుడు నిర్ధారించాడు. ఇది మనలోనే స్థితమై ఉన్న దుష్ట ప్రలోభం. ప్రాపంచిక వస్తువులు తృప్తిని/ఆనందాన్ని ఇస్తాయి అని నమ్మించి, రజో గుణము, ఆత్మను ప్రలోభానికి గురిచేస్తుంది, ఈ భ్రమలో, వాటిని పొందటానికి మనిషి ఆశ పడతాడు. ఎప్పుడైతే కోరిక తీరుతుందో అది దురాశ/లోభముకి దారి తీస్తుంది. మానవుడు ఈ మూడింటి ప్రభావంచే పాపాలు చేస్తాడు — కామము, లోభము మరియు క్రోధము. లోభము అంటే తీవ్రతరమైన కోరిక. కోపము అంటే ఆశాభంగమైన కోరిక. కాబట్టి, శ్రీ కృష్ణుడు కామమే (లేదా కోరికలే) అన్ని అరిష్టాలకు మూల కారణం అని ముద్ర వేసాడు.

Watch Swamiji Explain This Verse