యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే।
మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి ।। 12 ।।
యే — ఏదైతే; చ — మరియు; ఏవ — నిజముగా; సాత్త్వికాః — సత్త్వగుణములో; భావాః — భౌతిక అస్తిత్వంలో ఉన్న దశలు; రాజసాః — రజోగుణములో; తామసాః — తమస్సు; చ — మరియు; యే — ఏదైనా; మత్తః — నా నుండి; ఏవ — నిజముగా; ఇతి — ఈ విధముగా; తాన్ — అవి; విద్ధి — తెలుసుకొనుము; న — లేదు; తు — కానీ; అహం — నేను; తేషు — వాటిలో; తే — అవి; మయి — నా యందు.
BG 7.12: భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములు — సత్త్వము, రజస్సు, తమస్సు — నా శక్తి ద్వారానే వ్యక్తమైనాయి. అవి నా యందే ఉన్నాయి, కానీ నేను వాటికి అతీతుడను.
తన యొక్క మహిమలను ఇంతకు క్రితం నాలుగు శ్లోకాలలో వివరించిన పిదప, శ్రీ కృష్ణుడు ఇప్పుడు వాటి సారాంశం ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ‘అర్జునా, నేనే సమస్త వస్తువిషయములలో ఉన్న మూల సారము ఎలాగో చెప్పి ఉన్నాను. కానీ, ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్లి లాభం లేదు. అన్నీ మంచి, చెడు, మరియు వికృత వస్తువులు మరియు స్థితిగతులు నా శక్తి ద్వారానే సాధ్యమవుతున్నాయి.’
సమస్త వస్తువులు భగవంతుని నుండే ఉద్భవించినా, ఆయన మాత్రం వాటికంటే స్వతంత్రుడు మరియు వాటికి అతీతుడు. ఆల్ఫ్రెడ్ టెన్నీసన్ ఇదే విషయాన్ని తన ప్రఖ్యాత కవిత ‘ఇన్ మెమోరియం’ (In Memorium) లో ఇలా వ్యక్తపరిచాడు:
Our little systems have their day;
They have their day and cease to be.
They are but broken lights of thee,
And thou, O Lord, art more than they.
యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే।
మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి ।। 12 ।।
భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములు — సత్త్వము, రజస్సు, తమస్సు — నా శక్తి ద్వారానే వ్యక్తమైనాయి. అవి నా యందే ఉన్నాయి, కానీ నేను వాటికి …
Sign in to save your favorite verses.
Sign Inపవిత్ర భగవద్గీత యొక్క శాశ్వత ప్రేరణాత్మక జ్ఞానంతో మీ రోజును ప్రారంభించండి; అది నేరుగా మీ ఇమెయిల్‌కు చేరుతుంది!
Welcome 🙏
Here's what you've unlocked
Bookmarks
Save verses for quick return
Notes
Write your own reflections
Progress
Track all 18 chapters
Verse of the Day
A new shloka in your inbox daily