Bhagavad Gita: Chapter 1, Verse 11

అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః ।
భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి ।। 11 ।।

అయనేషు — వ్యూహాత్మక స్థానాల యందు; చ — మరియు; సర్వేషు — అన్నీ; యథాభాగం — మీ మీ స్థానాల లో; అవస్థితాః — నిలిచివుండి; భీష్మం — భీష్మ పితామహుడిని; ఏవ — మాత్రమే; అభిరక్షంతు — రక్షించండి; భవంతః  — మీరు; సర్వే — అందరు; ఏవ హి — కూడా.

Translation

BG 1.11: కావున, కౌరవ సేనా నాయకులందరికీ, మీమీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను.

Commentary

శత్రువులకు అసాధ్యుడైన భీష్ముడిని, తన సైన్యానికి స్ఫూర్తిగా, శక్తిగా పరిగణించాడు ధుర్యోధనుడు. కాబట్టి తన సేనా నాయకులని తమ తమ సైనిక వ్యూహ స్థానాలని కాపాడుకుంటూ, భీష్ముడిని పరిరక్షించమని కోరాడు.