Bhagavad Gita: Chapter 13, Verse 4

తత్ క్షేత్రం యచ్చ యాదృక్చయద్వికారి యతశ్చ యత్ ।
స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు ।। 4 ।।

తత్ — అది; క్షేత్రం — క్షేత్రము; యత్ — ఏదైతే; చ — మరియు; యాదృక్ — దాని స్వభావము; యత్-వికారి — దానిలో మార్పులు/కదలికలు ఎలా సంభవిస్తాయో; యతః — దేని నుండి; చ — మరియు; యత్ — ఏది; సః — అతడు; చ — మరియు; యః — ఎవరు; యత్-ప్రభావః — అతని ప్రభావ సామర్థ్యము ఏమిటో; చ — మరియు; తత్ — అది; సమాసేన — సంక్షిప్తముగా; మే — నా నుండి; శృణు — వినుము

Translation

BG 13.4: వినుము, క్షేత్రము అంటే ఏమిటో దాని స్వభావం ఏమిటో నేను నీకు వివరిస్తాను. దానిలో మార్పు ఎలా సంభవిస్తుందో, అది దేనిచే సృష్టించబడినదో, క్షేత్రజ్ఞుడు ఎవరో, వాని శక్తిసామర్థ్యము ఏమిటో కూడా వివరిస్తాను.

Commentary

శ్రీ కృష్ణుడే తానే స్వయముగా ఇప్పుడు చాలా ప్రశ్నలు సంధిస్తున్నాడు, మరియు అర్జునుడిని జాగ్రత్తగా వాటి సమాధానములను వినమని అంటున్నాడు.