అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః ।
సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి ।। 36 ।।
Translation: పాపాత్ములందరి కంటే పరమ పాపిష్ఠి వారు అని పరిగణించబడిన వారు కూడా ఈ ప్రాపంచిక భవసాగరాన్ని ఆధ్యాత్మిక దివ్య జ్ఞానమనే పడవలో స్థితులై ఉండి దాటిపోవచ్చు.
Commentary: భౌతిక ప్రాపంచిక జగత్తు ఒక మహా సాగరం వంటిది, దీనిలో జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే అలలు మనలను అటూ ఇటూ త్రోసి వేస్తుంటాయి. భౌతిక శక్తి, అందరినీ మూడు రకాల క్లేశములకు (కష్టాలకు) గురి చేస్తుంది: ఆదిఆత్మిక: తన స్వంత శరీరం, మనస్సు పెట్టే బాధలు; …
ఈ శ్లోకాన్ని తెరవండి ›Google శోధనలో #1 గీతా సైట్
ఈ రోజు వరకు సందర్శకుల సంఖ్య
చేతిలో ఉన్న తక్షణ సమస్యను ఎదుర్కోలేక అర్జునుడు తాను అనుభవిస్తున్న విషాదాన్ని అధిగమించేందుకు ఉపశమనం కోసం శ్రీకృష్ణుడిని ఆశ్రయించాడు. శ్రీకృష్ణుడు అతని తక్షణ సమస్యపై మాత్రమే సలహా ఇవ్వకుండా, జీవన తత్వంపై లోతైన ఉపదేశం ఇచ్చాడు. అందుకే భగవద్గీత యొక్క అత్యున్నత లక్ష్యం బ్రహ్మ విద్యను, అంటే భగవద్ సాక్షాత్కార శాస్త్రాన్ని బోధించడం.
భగవద్గీత ఉన్నతమైన తాత్విక అవగాహనను అందించడంలో మాత్రమే ఆగిపోదు; దాని ఆధ్యాత్మిక సూత్రాలను రోజువారీ జీవితంలో అమలు చేయడానికి స్పష్టమైన పద్ధతులను కూడా వివరిస్తుంది. మన జీవితాల్లో ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అన్వయించే ఈ పద్ధతులను "యోగ" అంటారు. అందుకే భగవద్గీతను "యోగ శాస్త్రం" అని కూడా అంటారు, అంటే యోగ సాధనను బోధించే శాస్త్రం.
అనుభవం లేని ఆధ్యాత్మిక సాధకులు తరచుగా ఆధ్యాత్మికతను లోకజీవితానికి వేరుగా చూస్తారు; కొందరు పరమానందాన్ని పరలోకంలో పొందాల్సినదిగా భావిస్తారు. కానీ భగవద్గీత అలాంటి భేదాన్ని చేయదు; ఈ లోకంలోనే మానవ జీవితంలోని ప్రతి అంశాన్ని పవిత్రం చేయడమే దాని లక్ష్యం. అందువల్ల దాని పద్దెనిమిది అధ్యాయాలన్నీ యోగం యొక్క విభిన్న రకాలుగా పేర్కొనబడతాయి, ఎందుకంటే అవి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వ్యావహారిక జీవితంలో అన్వయించే విధానాలతో సంబంధం కలిగి ఉంటాయి.
మీరు వెతుకుతున్న జ్ఞానానికి నేరుగా వెళ్లండి
Journey through 18 chapters of timeless wisdom, each revealing profound truths about life, duty, and the divine
అర్జున విషాద యోగము
దాయాదులైన కౌరవులు, పాండవుల మధ్య మొదలవ్వబోతున్న గొప్ప మహాభారత సంగ్రామ యుద్ధభూమి యందు భగవద్గీత చెప్పబడింది. ఈ భారీ యుద్ధానికి దారి తీసిన పరిణామాల యొక్క వివరణాత్మక …
సాంఖ్య యోగము
ఈ అధ్యాయములో అర్జునుడు, పరిస్థితిని తట్టుకోవడంలో ఉన్న తన పూర్తి అశక్తతని పునరుద్ఘాటించి, ఆసన్నమైన యుద్ధంలో తన విధిని నిర్వర్తించడానికి నిరాకరిస్తాడు. ఆ తరువాత శ్రీ కృష్ణుడిని …
కర్మ యోగము
అన్ని ప్రాణులూ తమ తమ ప్రకృతి సిద్ధమైన స్వాభావిక లక్షణంచే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయనీ, మరియు ఎవరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మలు …
జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము
నాలుగవ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు, తను ఉపదేశించే ఈ జ్ఞానంపై, దాని యొక్క సనాతనమైన మూలాన్ని తెలియచేయటం ద్వారా, అర్జునుడి విశ్వాసాన్ని దృఢపరుస్తున్నాడు. ఈ సనాతనమైన శాస్త్రాన్ని …
కర్మ సన్యాస యోగము
ఈ అధ్యాయం 'కర్మ సన్యాస' (పనులను త్యజించటం) మార్గాన్ని 'కర్మ యోగ' (భక్తి యుక్తంగా పనిచేయటం) మార్గంతో పోల్చి చూపుతుంది. రెండూ కూడా ఒకే లక్ష్యం దిశగా …
ధ్యాన యోగము
ఈ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు, ఐదవ అధ్యాయంలో నుండీ ఉన్న వస్తున్న 'కర్మ యోగ' (ప్రాపంచిక విధులు నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మిక అభ్యాసం చేయటం) మరియు 'కర్మ సన్యాస' …
జ్ఞాన విజ్ఞాన యోగము
భగవంతుని శక్తుల యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక విస్తారాన్ని వివరించటంతో ఈ అధ్యాయం మొదలౌతుంది. ఇవన్నీ కూడా తన నుండే ఉద్భవించాయని, దారంలో గుచ్చబడిన పూసల వలె …
అక్షర బ్రహ్మ యోగము
ఉపనిషత్తులలో విస్తారంగా చెప్పబడిన చాలా పదాలని మరియు విషయాలని ఈ అధ్యాయం క్లుప్తంగా వివరిస్తుంది. ఇది మరణం తరువాత ఆత్మ యొక్క గమ్యాన్ని నిర్ణయించే కారకాలను కూడా …
రాజ విద్యా యోగము
ఏడవ మరియు ఎనిమిదవ అధ్యాయాలలో శ్రీ కృష్ణుడు, యోగ ప్రాప్తికి, భక్తియే అన్నింటికన్నా సులువైన మార్గమని, భక్తియే అత్యున్నత యోగ విధానమని ప్రకటించి ఉన్నాడు. తొమ్మిదవ అధ్యాయంలో …
విభూతి యోగము
భగవంతుని యొక్క వైభవోపేతమైన మరియు దేదీప్యమానమైన మహిమలను గుర్తుచేసుకుంటూ ఆయనపై ధ్యానం చేయటానికి సహాయముగా అర్జునుడికి ఈ అధ్యాయము శ్రీ కృష్ణుడిచే చెప్పబడినది. తొమ్మిదవ అధ్యాయంలో, శ్రీ …
విశ్వ రూప దర్శన యోగము
ఇంతకు క్రితం అధ్యాయంలో, అర్జునుడి భక్తిని మరింత వికసింపచేయటానికి, శ్రీ కృష్ణుడు తన దివ్య విభూతులను వివరించి ఉన్నాడు. సుందరమైనవి, మహాద్భుతమైనవి, మరియు శక్తివంతమైనవి అన్నీ కూడా …
భక్తి యోగము
ఈ చిన్న అధ్యాయము, మిగతా అన్ని ఆధ్యాత్మిక మార్గముల కన్నా, ప్రేమ యుక్త భక్తి మార్గము యొక్క సర్వోన్నత ఉత్కృష్టతని నొక్కివక్కాణిస్తుంది. యోగములో ఎవరిని ఎక్కువ శ్రేష్ఠులుగా …
క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము
ఒక్కోటి ఆరు అధ్యాయములతో కూడిన మూడు విభాగాలుగా, భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి. మొదటి ఆరు అధ్యాయముల భాగము కర్మ యోగాన్ని విశదీకరిస్తుంది. రెండవ భాగము, …
గుణత్రయ విభాగ యోగము
గత అధ్యాయము, ఆత్మ మరియు భౌతిక శరీరమునకు మధ్య తేడాని విపులంగా విశదీకరించింది. ఈ అధ్యాయము, దేహము మరియు దాని మూలకముల యొక్క మూలశక్తి అయిన భౌతిక …
పురుషోత్తమ యోగము
ఇంతకు క్రితం అధ్యాయములో, ప్రకృతి త్రిగుణములకు అతీతులమవటం ద్వారా భగవత్ లక్ష్యమును చేరుకోవచ్చు అని శ్రీ కృష్ణుడు వివరించి ఉన్నాడు. అనన్య భక్తిలో నిమగ్నమవటమే త్రి-గుణములకు అతీతులమై …
దైవాసుర సంపద్విభాగ యోగము
ఈ అధ్యాయములో, శ్రీ కృష్ణుడు, మనుష్యులలో ఉండే రెండు రకాల స్వభావాలను వివరిస్తున్నాడు - దైవీ గుణాలు మరియు ఆసురీ గుణాలు. శాస్త్ర ఉపదేశాలను/నియమాలను పాటించటం, సత్త్వ …
శ్రద్ధా త్రయ విభాగ యోగము
పదునాలుగవ అధ్యాయములో, శ్రీ కృష్ణుడు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములను వివరించి ఉన్నాడు మరియు అవి మనుష్యులను ఏవిధంగా ప్రభావితం చేస్తాయో కూడా చెప్పాడు. ఈ పదిహేడవ …
మోక్ష సన్యాస యోగము
ఈ భగవద్గీత యొక్క ఈ చిట్టచివరి అధ్యాయము మిగతా అన్ని అధ్యాయాల కన్నా దీర్ఘమైనది మరియు ఇది చాలా విషయములను వివరిస్తుంది. అర్జునుడు సన్యాసము అనే విషయాన్ని …
పవిత్ర భగవద్గీత యొక్క శాశ్వత ప్రేరణాత్మక జ్ఞానంతో మీ రోజును ప్రారంభించండి; అది నేరుగా మీ ఇమెయిల్‌కు చేరుతుంది!
Welcome 🙏
Here's what you've unlocked
Bookmarks
Save verses for quick return
Notes
Write your own reflections
Progress
Track all 18 chapters
Verse of the Day
A new shloka in your inbox daily