Bhagavad Gita: Chapter 10, Verse 16-17

వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః ।
యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి ।। 16 ।।
కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ ।
కేషు కేషు చ భావేషు చింత్యోఽసి భగవన్మయా ।। 17 ।।

వక్తుం — విశదపరుచుటకు; అర్హసి — దయచేయుము; అశేషేణ — సంపూర్ణముగా; దివ్యాః — దివ్యమైన; హి — నిజముగా; ఆత్మ — నీ స్వంత; విభూతయః — విభూతులను; యాభిః — దేనిచేత నయితే; విభూతిభిః — విభూతులు; లోకాన్ — సమస్త లోకములలో; ఇమాన్ — ఇవి; త్వం — నీవు; వ్యాప్య — వ్యాపించి; తిష్టసి — స్థితుడవై ఉండి; కథం — ఏ విధముగా; విద్యాం అహం — నేను ఎలా తెలుసుకోగలను; యోగిన్ — యోగమాయా కే అధిపతి; త్వాం — నీవు; సదా — ఎల్లప్పుడూ; పరిచింతయన్ — ధ్యానిస్తూ; కేషు — దేని; కేషు — దేని; చ — మరియు; భావేషు — రూపములలో; చింత్యః అసి — స్మరించబడాలి; భగవన్ — పరమ దివ్య మంగళ స్వరూపా; మయా — నా చేత.

Translation

BG 10.16-17: నీవు సమస్త జగత్తుల యందు వ్యాపించి వాటి యందు వసించి ఉండే నీ దివ్య విభూతులను దయచేసి నాకు వివరించుము. ఓ యోగేశ్వారా, నేను నిన్ను ఎలా తెలుసుకోగలను మరియు ఎలా స్మరిస్తూఉండేను? మరియు ధ్యానం చేస్తున్నప్పుడు ఏ ఏ స్వరూపాలలో నిన్ను చింతన చేయగలను, ఓ భగవంతుడా?

Commentary

ఇక్కడ యోగమ్ అంటే యోగమాయ (భగవంతుని దివ్యమైన శక్తి), మరియు యోగి అంటే యోగమాయ యొక్క యజమాని. శ్రీ కృష్ణుడు భగవానుడు అని అర్జునుడు అర్థం చేసుకున్నాడు. శ్రీ కృష్ణుడి విభూతులు ఏ ఏ విధముగా ఈ జగత్తులో ప్రకటితమవుతాయో , ఇంకా చెప్పబడని వాటిని, ఇప్పుడు తెలుసుకోగోరుతున్నాడు. సమస్త జగత్తుని నియంత్రించి నిర్వహించేవాడిగా శ్రీ కృష్ణుడి మహిమలను మరియు అత్యున్నత స్థాయిని గురించి వినాలని కోరికతో ఉన్నాడు. అందుకే ఈ విధంగా ప్రాధేయపడుతున్నాడు, "నాకు నిశ్చలమైన భక్తి ప్రసాదించబడటానికి నీ దివ్య లీలలను తెలుసుకోగోరుచున్నాను. కానీ, నీ కృప లేకుండా, నీ వ్యక్తిత్త్వం గురించి తెలుసుకోవటం అసాధ్యము. కాబట్టి, దయచేసి నామీద కృపతో , నిన్ను అర్థంచేసుకొనుటకై, నీ యొక్క మహిమలను తెలియచేయుము."