Bhagavad Gita: Chapter 11, Verse 35

సంజయ ఉవాచ।
ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య
కృతాంజలిర్వేపమానః కిరీటీ ।
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం
సగద్గదం భీతభీతః ప్రణమ్య ।। 35 ।।

సంజయ ఉవాచ — సంజయుడు పలికెను; ఏతత్ — ఈ విధముగా; శృత్వా — విన్న తరువాత; వచనం — మాటలను; కేశవస్య — శ్రీ కృష్ణుడి (కేశవుని) యొక్క; కృత-అంజలిః — చేతులు జోడించి; వేపమానః — వణుకుతూ; కిరీటీ — అర్జునుడు, కిరీటము ధరించినవాడు; నమస్కృత్వా — నమస్కరిస్తూ; భూయః — మళ్ళీ; ఏవ — నిజముగా; ఆహ — పలికెను; కృష్ణం — శ్రీ కృష్ణుడితో; స-గద్గదం — గద్గద స్వరముతో; భీత-భీతః — భయముతో భీతిల్లిపోయి; ప్రణమ్య — నమస్కరించి.

Translation

BG 11.35: సంజయుడు పలికెను : కేశవుడు పలికిన మాటలు విన్న తరువాత అర్జునుడు భీతితో వణికిపోయాడు. చేతులు జోడించి, శ్రీ కృష్ణుడి ఎదుట వంగి నమస్కరిస్తూ భయము ఆవరించి గద్గద స్వరముతో ఇలా పలికెను.

Commentary

ఇక్కడ, అర్జునుడు ‘కిరీటి’ (కిరీటధారి) అని సంబోధించబడ్డాడు; ఒకానొక సమయంలో అతను ఇద్దరు రాక్షసులను సంహరించటంలో ఇంద్రుడికి సహాయం చేసాడు. దానితో ప్రీతి చెందిన ఇంద్రుడు, ఒక మిరుమిట్లుగొలిపే కిరీటమును ఆయన శిరస్సుపై ఉంచాడు. ఈ శ్లోకంలో, సంజయుడు అర్జునుడి శిరస్సున ఉన్న కిరీటమును సూచిస్తున్నాడు. అదే సమయంలో, కిరీటము అనేది రాజ్యాధికారమునకు గుర్తు, అందుకే సంజయుడు, వృద్ధుడైన ధృతరాష్ట్రునుకి, జరగబోయే యుద్ధంలో ఆయన పుత్రులైన కౌరవులు సింహాసనాన్ని పాండవులకు ఓడిపోతారని సూచిస్తూ, కావాలనే ఆ పదం వాడుతున్నాడు.