Bhagavad Gita: Chapter 11, Verse 12

దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా ।
యది భాః సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః ।। 12 ।।

దివి — ఆకాశములో; సూర్యః — సూర్యులు; సహస్రస్య — వేల కొలది; భవేత్ — ఉండి; యుగపత్ — ఒకేసారి; ఉత్థితా — ఉదయించుట; యది — ఒకవేళ; భాః — ప్రకాశిస్తూ; సదృశీ — ఆ విధముగా అగుపిస్తూ; సా — అది; స్యాత్ — ఉన్నది; భాసః — ప్రకాశిస్తూ; తస్య — వాటి యొక్క; మహా-ఆత్మనః — ఆ మహోన్నత రూపము.

Translation

BG 11.12: ఆకాశములో వెయ్యి మంది సూర్యులు ఒకే సమయంలో ప్రకాశించినా, ఆ మహోన్నత రూపము యొక్క తేజస్సుకు సాటి రావు.

Commentary

సంజయుడు ఇప్పుడు ఆ విశ్వ రూపము యొక్క తేజస్సును వివరిస్తున్నాడు. కన్నులు మిరుమిట్లు గొలిపే ఆ ప్రకాశము ఎంతటిదో అవగాహన ఇవ్వటానికి, దానిని వెయ్యి సూర్యులు ఒక్కసారే మధ్యాహ్న ఆకాశంలో వెలిగితే వచ్చే కాంతితో పోల్చుతున్నాడు. నిజానికి, భగవంతుని తేజస్సు అనంతమైనది; దానిని సూర్యుని వెలుగు యొక్క ప్రమాణంతో కొలవటం సాధ్యం కాదు. అయినా, తరచుగా కథకులు, మనకు తెలియనిదానిని అర్థం చేపించటం కోసం ఏదో ఒక తెలిసిన దాని యొక్క ఉదాహరణని హెచ్చించి చెప్తుంటారు. ఈ వెయ్యి సూర్యుల ఉపమానము అనేది, ఆ విశ్వ రూప తేజస్సుకు మరేదీ సాటిలేదు అన్న సంజయుని అభిప్రాయమును సూచిస్తున్నది.