Bhagavad Gita: Chapter 3, Verse 39

ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా ।
కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ ।। 39 ।।

ఆవృతం — కప్పివేయును; జ్ఞానం — జ్ఞానము; ఏతేన — దీనిచే; జ్ఞానినః — జ్ఞానుల యొక్క; నిత్య-వైరిణా — నిత్య శత్రువు; కామ-రూపేణ — కామము (కోరికలు) అనే రూపంలో; కౌంతేయ — అర్జునా, కుంతీదేవి పుత్రుడా; దుష్పూరేణ — తృప్తి పరచలేని; అనలేన — అగ్నిలాగ; చ — మరియు.

Translation

BG 3.39: అత్యంత వివేకవంతుల జ్ఞానం కూడా, ఎప్పటికీ తృప్తిపఱుపరాని కోరికల రూపంలో ఉన్న శత్రువుచే కప్పివేయబడుతుంది, ఇది ఎన్నటికీ తీరదు మరియు అగ్నివలె మండుతూనే ఉంటుంది, ఓ కుంతీ పుత్రుడా.

Commentary

ఇక్కడ, కామము యొక్క హానికరమైన స్వభావాన్ని శ్రీ కృష్ణుడు మరింత స్పష్టంగా చెప్తున్నాడు. కామము అంటే ‘కోరిక’, దుష్పూరేణ అంటే ‘తృప్తిపఱుపరాని’ అనల అంటే ‘ఎన్నటికీ చల్లారనిది’ అని అర్థం. కోరిక అనేది జ్ఞానుల విచక్షణా శక్తిని వశపరుచుకొని, దాన్ని తీర్చుకోవటానికి ఉసిగొల్పుతుంది. కానీ, ఆ మంటని ఆర్పడానికి ఎంత ప్రయత్నిస్తే, అది అంత ఉధృతితో మండుతుంది. బుద్ధుడు ఇలా పేర్కొన్నాడు:

న కహాపణ వస్సేన, తిత్తి కామేసు విజ్జతి
అప్పస్సాదా కామా దుఖా కామా, ఇతి విఞ్ఞాయ పణ్డితో (ధమ్మపద, 186వ శ్లోకం)

‘కోరిక అనేది ఆర్పలేని అగ్నిలాగా మండుతూనే ఉంటుంది. అది ఎప్పటికీ ఎవరికీ సుఖాన్ని ఇవ్వలేదు. దుఃఖానికి మూల హేతువు అని తెలుసుకొని వివేకవంతులు దాన్ని త్యజిస్తారు.’ కానీ ఈ రహస్యం అర్థం చేసుకోలేనివారు, కోరికలను తీర్చుకోవటానికే వృధా ప్రయాసతో తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు.

Watch Swamiji Explain This Verse