అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః ।
శరీరస్థోఽపి కౌంతేయ న కరోతి న లిప్యతే ।। 32 ।।
అనాదిత్వాత్ — అనాది అయినది; నిర్గుణత్వాత్ — ఎంటువంటి భౌతిక గుణములు లేకుండా; పరమ-ఆత్మా — పరమాత్మ; అయం — ఇది; అవ్యయః — నాశరహితుడు; శరీర-స్థ — శరీరములో నివసిస్తూ; అపి — అయినా సరే; కౌంతేయ — అర్జునా, కుంతీ దేవి తనయుడా; న కరోతి — ఏమీ చేయడు; న లిప్యతే — ఏమీ అంటదు.
Translation
BG 13.32: ఓ కుంతీ తనయుడా, పరమాత్మ నాశములేనివాడు, అనాదియైనవాడు, భౌతిక లక్షణములు ఏవీ లేనివాడు. దేహములోనే స్థితమై ఉన్నా, ఆయన ఏమీ చేయడు, మరియు, భౌతిక శక్తి చే ఏమాత్రం కళంకితము కాడు.
Commentary
సమస్త ప్రాణుల హృదయములలో పరమాత్మగా స్థితమై ఉన్న భగవంతుడు, ఎప్పుడూ శరీరముతో అనుసంధానం కాడు, లేదా దేహము యొక్క స్థితిగతులచే ప్రభావితం కాడు. భౌతిక శరీరంలో అయిన ఉండటం వలన, ఆయన ఏ కోశానా భౌతిక పరంగా అవ్వడు, ఆయన కర్మ సిద్ధాంతమునకు మరియు జనన మరణ చక్రమునకు లోబడి ఉండడు (అతీతుడు), కానీ ఇవి ఆత్మచే అనుభవంలోకి వస్తాయి.