అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా ।
సర్వార్థాన్విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ ।। 32 ।।
అధర్మం — అధర్మము; ధర్మ — ధర్మము; ఇతి — ఈ విధముగా; యా — ఏదైతే; మన్యతే — ఊహిస్తారో (భావిస్తారో); తమస-ఆవృతా — చీకటిలో కప్పివేయబడి; సర్వ-అర్థాన్ — అన్ని విషయములలో; విపరీతాన్ — విరుద్ధముగా; చ — మరియు; బుద్ధిః — బుద్ధి; సా — అది; పార్థ — ప్రిథ పుత్రుడా; తామసీ — తామసిక గుణము లో ఉన్నట్టు;
Translation
BG 18.32: చీకటితో ఆవృత్తమై, అధర్మమునే ధర్మము అనుకుంటూ, అసత్యమును సత్యము అని భావిస్తూ ఉండే బుద్ధి తమోగుణ బుద్ధి.
Commentary
తామసిక బుద్ధి అనేది పవిత్రమైన జ్ఞానముచే ప్రకాశితము అయి ఉండదు. కాబట్టి అది అధర్మమునే తప్పుగా ధర్మము అని అనుకుంటుంది. ఉదాహరణకు, ఒక త్రాగుబోతు ఆ మద్యం యొక్క మత్తు పట్ల ఆసక్తి/అనుబంధంతో ఉంటాడు. కాబట్టి, అతని యొక్క అల్పబుద్ధి, చీకటిచే కప్పివేయబడినదై, తనకు తానే స్వయంగా చేసుకునే తీవ్ర హానిని గ్రహించలేడు; మరియు ఇంకొక సీసా కోసం తన ఆస్తిని కూడా అమ్మటానికి వెనుకాడడు. తామసిక బుద్ధి లో, విచక్షణా జ్ఞానము మరియు తర్కబద్ధ వివేచన అనేవి కోల్పోబడుతాయి.