Bhagavad Gita: Chapter 1, Verse 26

తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పిత్రూ నథ పితామహాన్ ।
ఆచార్యాన్మాతులాన్భ్రాతూన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం స్తథా ।। 26 ।।
శ్వశురాన్ సుహృదశ్చైవ సేనాయోరుభయోరపి ।

తత్ర — అక్కడ; అపశ్యాత్ — చూసి; స్థితాన్ — నిలిచిఉన్న; పార్థః — అర్జునుడు; పిత్రూన్ — తండ్రులను (పినతండ్రులు, పెదతండ్రులు); అథ — తరువాత; పితామహాన్ — తాతలను; ఆచార్యాన్ — గురువులను; మాతులాన్ — మేనమామలను; భ్రాతృన్ — సోదరులను; పుత్రాన్ — పుత్రులను; పౌత్రాన్ — మనుమలను; సఖీన్ — మిత్రులను; తథా — ఇంకా ; శ్వశురాన్ — (పిల్లనిచ్చిన) మామలను; సుహృదః —శ్రేయోభిలాశులను; చ — మరియు; ఏవ — నిజముగా; సేనయోః  — సైన్యములు ; ఉభయోః — రెంటిలో; అపి — కూడా.

Translation

BG 1.26: అక్కడ అర్జునుడు రెండు సైన్యములలో కూడా ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, దాయాదులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, మామలను ఇంకా శ్రేయోభిలాశులను చూచెను.

Watch Swamiji Explain This Verse