Bhagavad Gita: Chapter 2, Verse 13

దేహినోఽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా ।
తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ।। 13 ।।

దేహినః — దేహములోనున్న వాడు; (జీవాత్మ) అస్మిన్ — ఈ యొక్క; యథా — ఎట్లయితే; దేహే — శరీరంలో; కౌమారం — బాల్యము; యౌవనం — యుక్తవయస్సు; జరా — వార్ధక్యము (ముసలితనము); తథా — ఆ విధముగానే; దేహ-అంతర — ఇంకొక దేహము; ప్రాప్తిః — ఇవ్వబడును; ధీరః — ధీరులు, తెలివైనవారు; తత్ర — ఆ విషయములో; న ముహ్యతి — ఆందోళన పడరు.

Translation

BG 2.13: ఏ విధంగానయితే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము, యౌవనం, ముసలితనముల గుండా సాగిపోతుందో, అదేవిధముగా మరణ సమయంలో, జీవాత్మ మరియొక దేహము (శరీరము) లోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయమున ఆందోళన పడరు.

Commentary

శ్రేష్ఠమైన తర్కము తో శ్రీ కృష్ణుడు, ఒక జన్మ నుండి ఇంకొక జన్మకు, ఆత్మ ఒక శరీరం నుంచి మరొక శరీరంలోకి ప్రవేశించే సిద్ధాంతాన్ని నిరూపిస్తున్నాడు. ఒక జన్మ లోనే మనము బాల్యము, యౌవనము, యుక్తవయసు, వృద్ధాప్య దశలలో శరీరాలు మారుస్తూ ఉంటాము అని వివరిస్తున్నాడు. వాస్తవానికి ఆధునిక శాస్త్రము ప్రకారం శరీరం లోని జీవ కణాలు నిరంతరంగా పునరుత్పత్తి చెందుతుంటాయి - పాత కణాలు మృతినొందుతూ, వాటి స్థానంలో కొత్త కణాలు చేరుతుంటాయి. ఒక అంచనా ప్రకారం, ఏడు సంవత్సరాల లోపు, అన్నీ జీవ కణాలు మారిపోతాయి. అంతేకాక, కణాలలోని అణువులు ఇంకా వేగంగా మారిపోతాయి. మనము తీస్కునే ప్రతి శ్వాస ద్వారా జీవక్రియచే, ఆక్సిజన్ అణువులు జీవ కణాల లోనికి పీల్చబడి, అప్పటివరకు కణాలలో ఉన్న అణువులు కార్బన్ డై ఆక్సైడ్ రూపంలో విడుదల చేయబడతాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఒక సంవత్సర కాలం లోనే మన శరీరం లోని తొంభై ఎనిమిది శాతం అణువులు మారిపోతాయి. అయినా సరే, నిరంతరం శరీరం మారిపోతున్నా, మనకు అదే వ్యక్తిని అన్న భావన ఉంటుంది. ఎందుకంటే మనము ఈ భౌతిక శరీరము కాదు, మనము లోపల వసించి ఉన్న ఈశ్వర-సంబంధియైన జీవాత్మ.

ఈ శ్లోకంలో, 'దేహ' అంటే శరీరము మరియు 'దేహి' అంటే 'దేహమును కలిగియున్నది 'అంటే 'ఆత్మ'. ఒక జీవితకాలం లోనే శరీరం నిరంతరంగా మారుతూ ఉండటంవలన ఆత్మ చాలా శరీరాలు మారినట్టే, అలాగే, ఇది మరణం తరువాత ఇంకొక శరీరాన్ని స్వీకరిస్తుంది, అన్న విషయం పట్ల అర్జునుడి ఆసక్తిని శ్రీ కృష్ణుడు పెంపొందిస్తున్నాడు. నిజానికి, ప్రాపంచిక పరిభాషలో - 'మరణం' అని మనం అనుకునేది, జీవాత్మ తన యొక్క పనిచేయని పాత శరీరాన్ని త్యజించడం మాత్రమే, “పుట్టుక” అనేది జీవాత్మ కొత్త శరీరాన్ని ఇంకోచోట తీసుకోటమే. ఇదే పునర్జన్మ సిద్ధాంతం.

చాలామటుకు తూర్పుదేశ తత్వశాస్త్రములు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాయి. హిందూ, జైన, సిక్కు మతాలలో ఇది అంతర్భాగం. బౌద్ధమతం లో, బుద్ధుడు తన గత జన్మలను చాలా సార్లు ప్రస్తావిస్తాడు. పాశ్చాత్య తత్వశాస్త్ర సిద్ధాంతంలో కూడా పునర్జన్మ సిద్ధాంతం ఎంత ప్రబలంగా ఉండేదో చాలా మందికి తెలియదు. పురాతన పాశ్చాత్య మతాలు, తత్వశాస్త్ర వర్గాల్లో, ప్రసిద్ధ ఆలోచనాపరులు పైథాగరస్, ప్లేటో, మరియు సోక్రటీస్ వంటి వారు పునర్జన్మ నిజమని అంగీకరించారు మరియు వారి అభిప్రాయాలు కూడా Orphism, Hermeticism, Neoplatonism, Manicheanism, and Gnosticism లలో ప్రతిబింబిస్తున్నాయి. ప్రధానమైన అబ్రహమిక్ మతాలలో, మూడు ప్రధాన మతాల తత్వవేత్తలు కూడా పునర్జన్మ సిద్ధాంతానికి మద్దతు పలికారు. ఉదాహరణకి, Kabbalah ని అధ్యయనం చేసిన యూదులు, the Christian Cathars, మరియు Alawi Shias, Druze వంటి ఇస్లాం షియా శాఖలు. పాశ్చాత్య మతాలలో, ఉదాహరణకి, గొప్ప పురాతన యూదు చరిత్రకారుడు అయిన జోసెఫస్, తన రచనల్లో ఉపయోగించిన భాష ప్రకారం, ఆ కాలపు Pharisees మరియు Essenes లలో పునర్జన్మ నమ్మకం ఉన్నట్లు అనిపిస్తుంది. ఖచ్చితంగా యూదు కబ్బాలాహ్, పునర్జన్మని, 'గిల్గుల్ నేశామోట్' (gilgul neshamot), లేదా 'ఆత్మ యొక్క దొర్లుట' గా చెప్పడము జరిగింది. ప్రఖ్యాత సూఫీ తత్వవేత్త మౌలానా జలాలుద్దీన్ రూమీ ఈ విధంగా ప్రకటించాడు:

నేను రాయిగా చనిపోయి ఒక చెట్టు అయ్యాను; (I died out of the stone and I became a plant)
నేను చెట్టుగా చనిపోయి ఒక జంతువు అయ్యాను (I died out of the plant and became an animal)
నేను జంతువుగా చనిపోయి ఒక మనిషిని అయ్యాను (I died out of the animal and became a man)
అలాంటప్పుడు నేను మరణం గురించి ఎందుకు భయపడాలి? (Why then should I fear to die?)
మరణించి నేను తక్కువ అయిపోయింది ఎప్పుడు? (When did I grow less by dying?)
నేను మనిషి గా చనిపోయి ఒక దేవత అవుతాను (I shall die out of man and shall become an angel!)

అనేక మంది ప్రాచీన క్రైస్తవులు పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మి ఉన్నారు. క్రైస్తవ చరిత్ర తెలియచేసిన ప్రకారం, పునర్జన్మ సిద్ధాంతాన్ని చర్చించడానికి 553 AD లో, Council of Nicaea, సమావేశం, జరిగింది. బహుశా ప్రజల జీవితాలపై చర్చి యొక్క ఆధిపత్యం పెంచడానికి కాబోలు, ఆ తరువాత అది (పునర్జన్మ సిద్ధాంతం) మతవిరోధము గా ప్రకటించబడింది. అప్పటి వరకు అది సర్వ సాధారణముగా అంగీకరించబడింది. ఏసుక్రీస్తు తన శిష్యులకు 'John the Baptist' అనేవారు 'Elijah the Prophet' యొక్క అవతారమే అని చెప్పటం ద్వారా, పరోక్షంగా ఈ సిద్ధాంతాన్ని ప్రకటించారు. (మాథ్యూ 11:13-14, మాథ్యూ 17:10-13). ఇది పాత నిబంధన (ఓల్డ్ టెస్టమెంట్) లో కూడా పేర్కొనబడింది. (Malachi 4:5). క్రైస్తవ ఫాదర్స్ లలో పండితుడు అయిన Origen, ఇలా ప్రకటించారు: “Every man receives a body for himself according to his deserts in former lives” "ప్రతి మనిషి తన పూర్వ జన్మల కర్మల అనుగుణంగా ఒక శరీరం పొందుతాడు" సోలమన్ యొక్క 'బుక్ అఫ్ విస్డం ' ప్రకారం : "మంచి శరీరం తో సక్రమమైన అవయవాలతో పుట్టడం అనేది పూర్వ జన్మలలో చేసిన మంచి పనుల ప్రతిఫలం ". “To be born in sound body with sound limbs is a reward of the virtues of the past lives. (Wisdom of Solomon 8:19-20)

ప్రపంచవ్యాప్తంగా సైబీరియా, పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర అమెరికా మరియు ఆస్ట్రేలియా వంటి ప్రదేశాల్లో, అనేక గిరిజన సమాజాలలో పునర్జన్మ పై నమ్మకం కనబడుతుంది. ఇటీవలి శతాబ్దాల కాలం లో, కొత్త నాగరికత లైన Rosicrucians, Spiritism, Theosophists, and New Age followers ల చే పునర్జన్మ పునరుద్ఘాటించబడింది. ఇంకా ఇటీవలే, ప్రముఖ విశ్వవిద్యాలయాల గంభీర శాస్త్రీయ వర్గాలలో ఇది అధ్యయనం చేయబడింది. ఉదాహరణగా వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ మరియు డాక్టర్ జిమ్ టకర్ యొక్క రచనలు చెప్పవచ్చు.

పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించకుండా, ప్రపంచంలోని కష్టాలు, గందరగోళాలు మరియు అసంపూర్ణత అర్థం చేసుకోలేము. అందుకే, అనేక ప్రసిద్ధ పాశ్చాత్య తత్వవేత్తలు ఈ సిద్ధాంతాన్ని నమ్మారు. Virgil మరియు Ovid ఈ సిద్ధాంతం స్పష్టంగా దానికదే తెలిసిపోతోందని భావిస్తారు. జర్మన్ తత్వవేత్తలు Goethe, Fichte, Schelling, and Lessing దీన్ని అంగీకరించారు. మరింత ఇటీవల తత్వవేత్తలైన Hume, Spencer, and Max Mueller, అందరూ దీనిని నిర్వివాదమైన సిద్ధాంతమని ఒప్పుకున్నారు. పాశ్చాత్య కవులలో, Browing, Rosetti, Tennyson, and Wordsworth, మొదలగు వారు అందరూ దీనిని నమ్మారు.

శ్రీ కృష్ణుడు ఇంతకు పూర్వము, తెలివైన వారు శోకింపరు అని చెప్పి ఉన్నాడు. కానీ, నిజానికి మనము సంతోషాన్ని, దుఃఖాన్ని అనుభవిస్తున్నాము. దీనికి గల కారణం ఏమిటి ? ఇప్పుడు ఆ విషయాన్ని వివరిస్తాడు.

Watch Swamiji Explain This Verse