భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్ ।
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే ।। 44 ।।
భోగ — భోగములు; ఐశ్వర్య — విలాసముల పట్ల; ప్రసక్తానాం — మిక్కిలి మమకారాసక్తి ఉన్నవారికి; తయా — దాని వలన; అపహృత-చేతసామ్ — దిగ్భ్రమచెందిన బుద్ది తో; వ్యవసాయ-ఆత్మికా — నిశ్చయమైన; బుద్ధిః — బుద్ది; సమాధౌ — సాఫల్యం; న — కాదు; విధీయతే — నిలువదు.
Translation
BG 2.44: ప్రాపంచిక భోగాలు, సుఖాల పై మిక్కిలి మమకారంతో, వారి బుద్ధి చిత్తభ్రాంతికి లోనయ్యి, భగవద్ప్రాప్తి పథం లో సాఫల్యానికి కావలసిన ధృడ సంకల్పాన్ని వారు కలిగి ఉండలేరు.
Commentary
మనస్సు కు ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తి ఉన్నవారు భోగాలు, ఐశ్వర్యముల కోసం ప్రాకులాడుతుంటారు. సంపాదన ను పెంపొందించుకోవటానికి తమ బుద్ధి వాడుతూ, ఇంకా ఎక్కువ భౌతిక సంపత్తి ఎలా సమకూర్చుకుని, శారీరిక సుఖానుభవము మరింత పొందుదామా అని విచారిస్తుంటారు. ఈ విధంగా భ్రమకి లోనయ్యి భగవత్ ప్రాప్తి పథంలో పయనించటానికి కావలిసిన ధృఢ సంకల్పాన్ని అభివృద్ది చేసుకోలేకపోతారు.