Bhagavad Gita: Chapter 2, Verse 21

వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ ।
కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కమ్ ।। 21 ।।

వేద — తెలుసుకున్న; అవినాశినం — నాశము కానిది; నిత్యం — నిత్యమైనది; యః — ఎవరైతే; ఏనమ్ — ఇది; అజమ్ — జన్మ లేనిది; అవ్యయమ్ — మార్పుచెందనిది; కథం — ఎట్లా; సః — అది; పురుషః — వ్యక్తి; పార్థః — పార్థా; కం — ఎవరిని; ఘాతయతి — చంపే కారణం; హంతి — చంపును; కమ్ — ఎవరిని.

Translation

BG 2.21: ఓ పార్థ, ఆత్మ అనేది నాశనం చేయబడలేదు, నిత్యమైనది, పుట్టుక లేనిది, ఎన్నటికీ మార్పుచెందనిది అని తెలిసిన వ్యక్తి, ఎవరినైనా ఎట్లా చంపును? ఎవరినైనా చంపడానికి కారణం ఎట్లా అవ్వగలడు?

Commentary

ఆధ్యాత్మికంగా ఎదిగిన జీవాత్మ, మనచే చేయబడే కర్మలను చేసేది మనమే అన్న అహంకారాన్ని అణచి వేస్తుంది. ఆ స్థితిలో, మనలో ఉన్న జీవాత్మ నిజానికి ఏమీ చెయ్యదు అని గమనించవచ్చు. అలాంటి ఉన్నత స్థాయికి ఎదిగిన జీవులు, అన్నీ పనులు చేస్తూనే వున్నా, వాటి వల్ల కళంకితులు కారు. అటువంటి ఉన్నతమైన జ్ఞానోదయ స్థితికి తనను తాను ఉద్ధరించుకుని, తనను తాను అకర్తగా భావించుకొని, అహంకార రహితముగా, బాధ్యతను విస్మరించక తన విధిని నిర్వర్తించమని, అర్జునుడికి శ్రీ కృష్ణుడు ఉపదేశిస్తున్నాడు.

Watch Swamiji Explain This Verse